
ఆటో డ్రైవర్ల పొట్టకొట్టిన కూటమి ప్రభుత్వం
కొతూరు : కూటమి ప్రభుత్వం ఆటోడ్రైవర్ల పొట్టకొట్టిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాదరావు అన్నారు. కొత్తూరులో శుక్రవారం ఆటో డ్రైవర్లు నిరసన ర్యారీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయడం వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండాపోతోందన్నారు.
ఆదాయం లేక వాహన ఈఎంఐలు చెల్లించలేక, పిల్లల ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నారా లోకేష్ గతంలో పాదయాత్ర నిర్వహించిన సమయంలో ఆటో డ్రైవర్లను అన్ని విధాలా ఆదుకుంటానిని చెప్పి ఇప్పుడు ఉపాధి లేకుండా చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆటో డ్రైవర్లకు ప్రతి నెలా కొంతమొత్తం చెల్లించడంతో పాటు వాహన మిత్ర పథకం ద్వారా ఏటా రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. లేనిపక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్ల సంఘం నాయకులు, పెద్ద ఎత్తున డ్రైవర్లు పాల్గొన్నారు.