
240 లీటర్ల నాటుసారా పట్టివేత
కంచిలి: మండల పరిధిలో సోంపేట ఎకై ్సజ్ సీఐ జీవీ రమణ ఆధ్వర్యంలో శనివారం జరిపిన తనిఖీల్లో 240 లీటర్ల నాటుసారాను పట్టుకొని నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా నుంచి నాటుసారా రవాణా అవుతోందన్న సమాచారం మేరకు చొట్రాయిపురం బస్టాప్ వద్ద ఒక ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 1,200 నాటుసారా ప్యాకెట్లు(120 లీటర్లు)ను పోలీసులు పట్టుకున్నారు. అలాగే ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని, కంచిలి మండలం కాలాపాని గ్రామానికి చెందిన సవర నాయక్, బూరగాం గ్రామానికి చెందిన కొర్రాయి గోవింద్‌లను అరెస్టు చేశారు. ఈ నాటుసారా ప్యాకెట్లను బూరగాం గ్రామానికి చెందిన కర్రి మోహిని, రాపాక కృష్ణమూర్తి, గోకర్ణపురం గ్రామానికి చెందిన అయితి దాశరథికి సరఫరా చేస్తున్నట్లు చెప్పడంతో వారి మీద కూడా కేసులు నమోదు చేశారు. దేవిధంగా కంచిలి మండలంలో జలంత్రకోట పాతాళేశ్వరుని గుడి దగ్గర ఒక ద్విచక్ర వాహనాన్ని పట్టుకొని, 120 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. నాటుసారాను రవాణా చేస్తున్న కంచిలి మండలం కుంబరినౌగాం గ్రామానికి చెందిన పింకు గౌడ, తలతంపర పంచాయతీ పరిధి కాకర్లపుట్టుగ గ్రామానికి చెందిన కాకర్ల సోమేష్‌లను అరెస్టు చేశారు. దాడుల్లో పోలీసు సిబ్బంది మార్కారావు, భాను, అరుణ్, ఉమాపతి, గుణాకర్ తదితరులు లు పాల్గొన్నారు.