
ఏపీఎల్ నుంచి ఇద్దరికి పిలుపు
● ఏసీఏ ఉమెన్ టీ–20 లీగ్‌కు
నవ్య, వనజాక్షి ఎంపిక
● వైజాగ్ చీతాస్‌కు నవ్య, రాయలసీమ రాణీస్‌కు వనజాక్షి ప్రాతినిధ్యం
శ్రీకాకుళం న్యూకాలనీ: మూడునాలుగేళ్లగా నిలకడైన ఆటతీరుతో రాణిస్తున్న బూసి నవ్య, పనస వనజాక్షిలు ఏపీఎల్ నుంచి పిలుపు అందుకున్నారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో పటిష్టమైన వైజాగ్ చీతాస్ జట్టుకు నవ్య ప్రాతినిధ్యం వహించనుండగా, రాయలసీమ రాణీస్ జట్టుకు వనజాక్షి ప్రాతినిధ్యం వహిస్తుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ టోర్నీ త్వరలో మొదలుకానుంది. జిల్లా నుంచి వీరిద్దరూ ఉమెన్ ఏపీఎల్‌కు ఎంపిక కావడంపై జిల్లా క్రికెట్ సంఘం(జెడ్‌సీఏ) అధ్యక్షుడు పీవైఎన్ శాస్త్రి, కార్యదర్శి హసన్‌రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ, కౌన్సెలర్ డాక్టర్ ఎస్.రవికుమార్, సంఘ ప్రతినిధులు, కోచ్‌లు, సీనియర్ క్రికెటర్లు సంతోషం వ్యక్తంచేశారు.