
సెంచూరియన్ యూనివర్సిటీతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒప్ప
కొరాపుట్/పర్లాకిమిడి: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో సెంచూరియన్ యూనివర్సిటీ చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్తర ప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యా బొరేటరీ వర్సిటీల మధ్య ఈ నెల 29న ఎంఓయూ కుదిరింది. లక్నోలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా పరిశోధనాత్మక, న్యాయ సంబంధిత, సాంకేతిక అంశాల్లో రెండు సంస్థలు పరస్పరం సహకారం అందించుకుంటాయి. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ డీఐజీ రాజీవ్ కృష్ణతో సెంచూరియన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ముక్తికాంత్ మిశ్రా సమాలోచనలు చేశారు. డీఐజీ మాట్లాడుతూ ఈ రెండు సంస్థల కల యిక పరిశోధన రంగంలో నూతన మార్పులు తీసుకువస్తుందని తెలిపారు. సెంచూరియన్ వర్సిటీ ప్రెసిడెంట్ ముక్తి కాంత్ మిశ్రా మాట్లాడుతూ తాము 2016లోనే గుజరాత్ ఫోరెన్సిక్ విభాగంతో పనిచేశామని, ఇప్పుడు ఈ కొత్త ఒప్పందంతో ఫోరెన్సిక్ సేవలు సమాజానికి ఉపయోగపడతాయన్నా రు. ఈ ఒప్పందంపై ఉత్తర్ ప్రదేశ్ ఏడీఐజీ నవీన్ ఆరోరా, సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ సుప్రియ పట్నాయిక్ సంతకాలు చేశా రు. కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ లక్నో లోని స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్, సెంచూరియన్ యూనివర్సిటీ అంతర్జాతీయ, ప్రభు త్వ సంబంధాల డైరెక్టర్ మెనాలిసా ఘోష్, డాక్టర్ రీనా, సి.జమాతానీ తదితరులు పాల్గొన్నారు.