
‘మధ్యవర్తిత్వమే మేలు’
శ్రీకాకుళం పాతబస్టాండ్: కక్షిదారుల సమస్యలను స్వచ్ఛందంగా, త్వరితగతిన, పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే అత్యుత్తమ మార్గం మధ్యవర్తిత్వమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళం బార్ అసోసియేషన్ హాల్ లో నిర్వహించిన ‘మధ్యవర్తిత్వంపై న్యాయ విజ్ఞాన సదస్సు‘లో ఆయన ప్రసంగించారు. న్యాయస్థానం జోక్యం లేకుండా కక్షిదారుల మధ్య ఒప్పందం కుదురుతుందని, మధ్యవర్తి సూచనలతో షరతులు రూ పొందించి, స్పష్టమైన ఒప్పంద పత్రాన్ని తయారు చేస్తారని, ఇది ఆంతరంగికమైన, స్నేహపూర్వక పరిష్కార విధానమని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు భవనం నుంచి డే అండ్ నైట్ కూడలి వరకు భారీగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు.