
ఇదేం నిర్వాకం.?
చక్కగా బడిలో చదువుకుంటున్న ఇద్దరు పిల్లలు చనిపోయార ని సచివాలయ సిబ్బంది ఆన్‌లైన్‌లో తప్పుగా నమోదు చేశారు. ఫలితంగా వారిద్దరూ తల్లికి వందనంకు దూరమయ్యారు. మెళియాపుట్టికి చెందిన మూగి భాస్కరరావు, కృష్ణవేణిల కుమారులు మూగి మోక్షిత్, మూగి షారుఖ్ ఓ ప్రైవేటు స్కూల్‌లో చదువుతున్నారు. వీరికి తల్లికి వందనం డబ్బులు పడలేదు. ఎందుకా అని ఆరా తీస్తే.. హౌస్ హోల్డ్ సర్వేలో అధికారులు వారిద్దరూ చనిపోయినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. గతంలో వైఎస్ జగన్ ఉన్నప్పుడు అమ్మ ఒడి వచ్చిందని, ఈ సారి కూడా అలాగే వస్తుందని ధీమాగా ఉన్నామని, కానీ అధికారుల తప్పిదం వల్ల ఇద్దరు పిల్లలు పథకానికి దూరమయ్యారని వారు తెలిపారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
–మెళియాపుట్టి
చదువుకుంటున్న పిల్లలు చనిపోయినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వైనం
సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం
ఇద్దరికీ అందని ‘తల్లికి వందనం’