
బాలింతల మరణాలపై వైద్యబృందం ఆరా
సారవకోట: మండలంలోని బుడితి సీహెచ్‌సీని శనివారం జిల్లా వైద్యుల బృందం పరిశీలించింది. ఈ ఆస్పత్రిలో చేసిన ప్రసూ తి ఆపరేషన్ల కారణంగా ఇటీవల జలుమూరు మండలం పాగోడు, యలమంచిలి గ్రామాలకు చెందిన ఇద్దరు బాలింతలు మృతి చెందారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్, డీసీహెచ్‌ఎస్, కలెక్టర్ ఆదేశాల మేరకు టెక్కలి జిల్లా ఆస్పత్రి నుంచి డాక్టర్ ప్రసూనాంబ, డాక్టర్ ప్రతిభా చైతన్య, డాక్టర్ ప్రకాశ్ వర్మ, డాక్టర్ శ్రీనుబాబు, డాక్టర్ కాళీ చరణ్‌లతో కూడిన కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మృతులు ఎప్పటి నుంచి ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు, ఆపరేషన్ చేసిన సమయంలో వారి ఆరోగ్య పరిస్థితి, తదితర వివరాలను ఆపరేషన్ చేసిన వైద్యురాలు శోభారాణి, ఇతర వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేధిక అందించనున్నట్లు వారు తెలిపారు.