
బియ్యంలో పురుగుల గుర్తింపు
నందిగాం: జిల్లా సివిల్ సప్లై క్వాలిటీ అధికారి సంతోష్‌కుమార్ మండలంలోని పలు పాఠ శాలలను సందర్శించారు. నందిగాం, నర్సిపురం, లఖిదాసుపురం పాఠశాలలను ఆయన సోమవారం సందర్శించి బియ్యంలో సుంకు పురుగులు, తెలుపు రంగులో సన్నని పురుగులు ఉన్నట్లు గుర్తించారు.
బియ్యం గోదాము తనిఖీ
బూర్జ: మండలంలో గల సింగన్నపాలేం గ్రామ పంచాయతీ నామాల లక్ష్మీపురం గ్రామం పరిధిలో గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అనుబంధ సంస్థ ద్వారా నడుపుతున్న శ్రీసాయి హరి పద్మ లాజిస్టిక్స్ ప్రైవేటు లిమిటెడ్ ఇన్వెస్టర్ గోదామును జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సోమవారం పరిశీలించారు. గోదాములో నిల్వ ఉన్న రైస్, రికార్డులు పరిశీలించారు. పది రోజుల కిందట సరఫరా చేసిన బియ్యంలో ఎలాంటి లోపాలు లేవని తెలిపా రు. నామాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన చిక్కాల రంగబాబు అనే దివ్యాంగుడు తన ఇంటికి రేషన్ అందించాలని జేసీకి విన్నవించారు.
నేడు మెగా రక్తదాన శిబిరం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్ జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు దుర్గాపృథ్వీరాజ్ తెలిపారు. అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో యువజన విభాగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరంతోపాటు పలుసేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వైఎస్సార్ అభిమానులు, పార్టీ శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శ్రీకాకుళంలో రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంకు కమ్యూనిటీ హాల్‌లో శిబిరం నిర్వహిస్తామన్నారు.

బియ్యంలో పురుగుల గుర్తింపు