
పురుగులిలా.. బియ్యం వండేదెలా?
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి అందిస్తున్న బియ్యంలో పురుగులు కనిపిస్తుండటంతో ఇటు ఉపాధ్యాయులు, అటు నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. పురుగుల బియ్యంతో వండలేక, చిన్నారులకు పస్తులు ఉంచలేక సతమతమవుతున్నారు. కూటమి ప్రభుత్వం సన్నబియ్యం పేరిట పురుగుల బియ్యం పంపిణీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం సారవకోట మండలంలోని సారవకోట, ధర్మలక్ష్మిపురం, మొదలికొత్తూరు, చిన్నకిట్టాలపాడు తదితర పాఠశాలల్లో బియ్యంలో పురుగులు బయటపడ్డారు. కొత్తూరు మండలంతో పాటు జిల్లావ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు సరఫరా చేసే బియ్యం బస్తాల్లో పురుగులు ఉన్నట్లు ‘సాక్షి’ శనివారం వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
– సారవకోట/కొత్తూరు
కొత్తూరు: ఎస్సీ బాలుర వసతి గృహానికి అందించిన బియ్యంలో పురుగులు

పురుగులిలా.. బియ్యం వండేదెలా?