
సాధకుడికి స్వాగతం
అమ్మమ్మ ఊరిలోనూ సత్కారం
వెంకటేష్‌కు గజమాలతో సన్మానం
తన ముద్దుబిడ్డను అల్లాడపేట ఆత్మీయంగా స్వాగతించింది. జనమంతా తోడు రాగా సాధకుడికి జేజేలు పలికింది. దేశ అత్యున్నత సర్వీసుకు ఎంపికై న సందర్భంగా అల్లాడపేట వాసులంతా బాన్న వెంకటేష్‌కు ఆదివారం సాదరంగా ఆహ్వానం పలికి సగౌరవంగా సత్కరించారు. మొదటి ప్రయత్నంలో విజయం అంచులు వరకూ వెళ్లి, రెండో ప్రయత్నంలో ఐపీఎస్, మూడో ప్రయత్నంలో ఏకంగా జాతీయస్థాయిలో 15వ ర్యాంక్‌ను వెంకటేష్ సాధించా రు. ఓ వైపు ఐపీఎస్ శిక్షణ తీసుకుంటూనే మరో వైపు ఐఏఎస్ సాధనే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా చదివారు. ఆయన సాధించిన అపురూప విజయంపై అల్లాడపేట పులకరించి పోయింది. ఆయన ఆది వారం గ్రామానికి రావడంతో ఊరూవాడా ఒక్కటై మంగళవాయిద్యాల నడుమ పూల వర్షం కురిపించారు. పూర్ణకుంభంతో వెంకటేష్‌కు ఊరిలోకి స్వాగ తం పలికారు. ఊరివారందరినీ వెంకటేష్ వరసలు పెట్టి పిలుస్తూ ఆత్మీయంగా పలకరించారు. రామాలయం, అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
నా విజయం మా తల్లిదండ్రులకు అంకితం
అల్లాడపేట గ్రామస్తులు చేసిన పౌర సన్మానంలో వెంకటేశ్ మాట్లాడుతూ అత్యున్నత సర్వీసైన ఐఏఎస్‌కు ఎంపికయ్యానని, దీని వెనుక తన తల్లిదండ్రులు రోహిణి, చంద్రరావుల కష్టం ఎంతో దాగి ఉందని వినమ్రంగా చెప్పారు. తాను ఎంత పెద్దస్థాయికి ఎదిగినా ఎల్లకాలం వారికి రుణపడి ఉంటా నని చెప్పారు. ఈ విజయం తల్లిదండ్రులకు అంకి తం అని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కల్యా ణం చిన్నమ్మడు, జెడ్పీటీసీ మెండ విజయ శాంతి. గ్రామ పెద్దలు మెండ రాంబాబు,కల్యాణం శ్రీనువాసరావు, రిటైర్డ్ జడ్జి ఎం.రామకృష్ణ, వెలమ సంక్షేమ ప్రతినిధులు డాక్టర్ చక్క నారాయణరావు, ధర్మాన రఘునాథరావు, దుంగ సుధాకర్ బట్నా, కృష్ణ మూర్తి, ముద్దా అప్పలనాయుడు, వెలమల సత్యనారాయణ, ముద్దాడ వెంకట అప్పల నాయుడు, నక్క లక్ష్మణరావు, వెలమల మురళీ, ముద్దాడ జోగారావు తదితరులు పాల్గొన్నారు.
ఇష్టంతో చదివితే ఏదైనా సాధ్యమే
గ్రామానికి వచ్చిన అనంతరం వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. గ్రామీణ యువత సివిల్స్ సాధించాలంటే ముందుగా తల్లిదండ్రులకు భారం కాకుండా ఉపాధి వెతుక్కోవాలని మార్గనిర్దేశం చేశా రు. తనకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని, జాతీయ స్థాయిలో ఆడేందుకు కూడా ప్రయత్నించానని తెలిపారు. కానీ క్రికెట్ ఆడి డబ్బులు సంపాదించడం కంటే సివిల్స్ సాధించి పేదలకు సేవ చేయడం మంచిదని నమ్మి ఈ మార్గం ఎంచుకున్నానని వివరించారు. మన జిల్లా వ్యవసాయాధారిత జిల్లా అని, మన వెనుకబాటు రూపుమాపాలంటే చదువు ఒక్కటే మార్గమని సూచించారు. ఇష్టంతో ప్రణాళికాబద్ధంగా చదివితే సాదైనా సాధ్యమేనని అన్నారు. –జలుమూరు
సివిల్స్ విజేత బాన్న వెంకటేశ్‌ను ఆత్మీయంగా స్వాగతించిన అల్లాడపేట
‘అల్లాడ ముద్దుబిడ్డ’ అంటూ ఘనంగా సత్కారం
నరసన్నపేట: సివిల్స్ ర్యాంకర్ బాన్న వెంకటేష్‌ను తన అమ్మమ్మ ఊరు బసివలసలో సత్కరించారు. గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆరంగి శ్రీను, వెంకటేష్ మేనమామలు ఢిల్లీశ్వరరావు, రుద్రడులు, అమ్మమ్మ నర్సమ్మ , పాగోటి గోవిందు తదితరులు పాల్గొన్నారు.

సాధకుడికి స్వాగతం