
గిన్నిస్‌బుక్‌లోకి శామ్యూల్
పాతపట్నం: పాతపట్నం మేజర్ పంచాయతీ రామమందిరం వీధికి చెందిన సైన్స్ ఉపాధ్యాయుడు విక్టర్ శామ్యూల్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. విజయవాడకు చెందిన హలెల్ మ్యూజిక్ స్కూల్ తరఫున పాస్టర్ ఆగస్టిన్ దండింగి ఆధ్వర్యంలో గత ఏడాది డిసెంబర్ ఒకటో తేదీన 18 దేశాలకు చెందిన 1090 మంది ఒకేసారి ఆన్‌లైన్ వేదికగా గంట వ్యవధిలో కీబోర్డ్ ప్లే చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. దీనిని గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు గుర్తించి 1046 మందికి బుక్‌లో స్థానం కల్పించారు. అందులో శామ్యూల్ ఒకరు. ఇటీవల విజయవాడలోని గుణదలలో జరిగిన కార్యక్రమంలో శామ్యూల్‌కు ధ్రువీకరణపత్రం ప్రదానం చేశారు.