
వైఎస్ జగన్‌ను కలిసిన కృష్ణదాస్
వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. జిల్లాలో పార్టీ స్థితిగతులపై చర్చించారు. జగన్‌ను కలిసిన వారిలో పార్టీ మహిళా సీనియర్ నాయకురాలు బొడ్డేపల్లి పద్మజ కూడా ఉన్నారు.
– శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ)
శ్రీకాకుళం పాతబస్టాండ్: నీట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, అందుకు అన్ని శాఖల సమన్వయంతో చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. మే 4న జరగనున్న నీట్ పరీక్షలపై మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి మారెళ్ల వెంకటేశ్వరరావు నీట్ పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఆర్‌జేయూకేటీ–ఎచ్చెర్ల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ–గుజరాతీపేట, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల–శ్రీకాకుళం, కేంద్రీయ విద్యాలయం–శ్రీకాకుళం ఉన్నాయి. మే 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. సమావేశంలో డిస్ట్రిక్ట్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ కిరణ్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్, నీట్ సిటీ కోఆర్డినేటర్ సుహాయిబ్ ఆలం, చీఫ్ సూపరింటెండెంట్ పీవీ రమణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పకడ్బందీగా నీట్ పరీక్షలు

వైఎస్ జగన్‌ను కలిసిన కృష్ణదాస్