పాలకుల్లో
చలనం లేదు..
అధికారులు పట్టించుకో వడం లేదు. పాలకుల్లో చలనం లేదు. దీంతో మాకు ఇబ్బందులు తప్పడం లేదు. నది పక్కన ఉన్నామే తప్ప నీరు మాత్రం లేకుండా పోతోంది.
– ఇద్దుబోయిన ఆదిలక్ష్మి, హిరమండలం
హిరమండలం: అక్కడ రోజూ ‘పానీ’పట్టు యుద్ధమే. ఊరు వంశధార గట్టు కిందే ఉన్నా.. నీటి బొట్టు కూడా దొరకని వింత పరిస్థితి వారి ది. వేసవి కాలం వచ్చిందంటే బిందెలు పట్టుకుని గంటల కొద్దీ వేచి ఉండాల్సిన దుస్థితి. చుక్క చుక్క నీటి బొట్లు రాలుస్తూ వెక్కిరించే కుళాయిలు, ఎప్పుడు వస్తాయో తెలీని ట్యాంకర్లపై విసుగెత్తిపోయిన హిరమండలం మహిళలు శుక్రవారం రోడ్డెక్కారు. ఖాళీ బిందెలు పట్టుకుని అలికాం–బత్తిలి ప్రధాన రహదారిపై నిరసన తెలిపా రు. రహదారి గుండా ఎలాంటి వాహనాల రాకపోకలు జరగకుండా అడ్డుకున్నారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్ది చెప్పారు.
హిరమండలం మేజర్ పంచాయతీలో సుమారు 18 వేల మంది జనాభా ఉంది. ప్రతి మనిషికి రోజుకు సగటున 20 లీటర్ల నీరు అవసరం. ఈ లెక్కన 3,60,000 లీటర్ల నీరు అందించాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడో దశాబ్దాల కిందట ఏర్పాటుచేసిన పైపులైన్, మంచినీటి పథ కం సామర్థ్యం చాలడం లేదు. అటు సమగ్ర మంచినీటి పథకం, జలజీవన్ మిషన్ వంటి పథకాలు ఉన్నా ఏవీ అక్కరకు రావడం లేదు. వేసవికి ముందస్తు చర్యలు లేవు. ఇటీవల ఒకే సారి నీటికి ఇబ్బందులు రావడంతో అప్పటికప్పుడు బోర్లు తవ్వి పథకానికి అనుసంధానం చేశారు. అయినా తాగునీరు అందని దుస్థితి. కుళాయిల ద్వారా అంతంత మాత్రమే నీరు అందిస్తున్నారు. రోజువిడిచి రోజు నీరు రావడంతో మహిళలు పడరాని పాట్లు పడుతున్నారు. వేసవిలో నీటి ఎద్దడి ఉంటుందని తెలిసినా ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై వారు మండిపడుతున్నారు. దీనిపై ఆర్‌డబ్లూఎస్ డీఈ వెంకటప్పలనాయుడు వద్ద సాక్షి ప్రస్తావిస్తే మేజర్ ఇప్పటికే అదనంగా బోర్లు తవ్వామని వాటి నుంచి నీటిని పథకానికి అనుసంధానం చేస్తామని చెప్పారు.
గుక్కెడు నీటి కోసం ..
ఏటా వేసవి వచ్చిందంటే చాలు.. తాగునీటి కోసం చా లా ఇబ్బందులు పడతాం. నది చెంతనే ఉన్నామన్న మాటే కానీ.. గుక్కెడు నీటి కోసం కూడా పాట్లు పడాల్సిన పరిస్థితి.
– కొటివాడ లీలావతి, స్థానిక మహిళ,
హిరమండలం
వంశధార గట్టు.. నీరు దొరికితే ఒట్టు
వంశధార గట్టు.. నీరు దొరికితే ఒట్టు
వంశధార గట్టు.. నీరు దొరికితే ఒట్టు
వంశధార గట్టు.. నీరు దొరికితే ఒట్టు