నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

Published Sat, Mar 15 2025 1:32 AM | Last Updated on Sat, Mar 15 2025 1:31 AM

సెల్‌ఫోన్‌ కొన్నారు.. కొన్నాళ్లకే రిపేరుకు వచ్చింది. మౌనంగా ఉండిపోకండి.

ఆ మౌనమే మోసానికి ప్రోత్సాహం.

పండ్లు కొన్నారు.. కొలతలో తేడా తెలుస్తోంది. నిశ్శబ్దంగా ఉండిపోకండి.

ఆ నిశ్శబ్దమే హక్కులకు మరణశాసనం.

వస్తువులు కొన్నారు.. ఎమ్మార్పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నాడు.

మనకెందుకులే అనుకోకండి. ఆ నిర్లిప్తతే అక్రమాలకు అసలు కారణం.

డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు దానికి తగ్గట్టు సేవలు పొందే అధికారం అందరికీ ఉంది. డబ్బుకు తగ్గ వస్తువు లేదా సేవ అందనప్పుడు మీ హక్కుకు భంగం వాటిల్లినట్టే. ఆ హక్కులను కాపాడేందుకే ఏటా ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం నిర్వహిస్తారు. ఈ హక్కులు కాపాడేందుకు ఓ పెద్ద వ్యవస్థే నడుస్తోంది. మనం చేయాల్సిందల్లా దానిపై అవగాహన పెంచుకోవడమే. – శ్రీకాకుళం పీఎన్‌ కాలనీ, శ్రీకాకుళం పాతబస్టాండ్‌,

శ్రీకాకుళం,అరసవల్లి, టెక్కలి, శ్రీకాకుళం కల్చరల్‌

తూకాల్లో తేడాలు, ధరల్లో వ్యత్యాసాలు, నాణ్యతలో మార్పులు.. కొనుగోలుదారుడు అను నిత్యం మోసపోతున్నాడు. చిన్న పాన్‌షాపు మొదలకుని పెద్ద షోరూమ్‌ వరకు జిల్లాలో ఈ తరహా మోసాలు లెక్కకు మిక్కిలి జరుగుతున్నాయి. కానీ కొందరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఇలా మోసపోతున్న వారికి అండగా నిలిచేందుకు వినియోగదారుల రక్షణ చట్టం అంటూ ఒకటుంది. దీన్ని 1986లోనే ఏర్పాటు చేశారు. 2019లో కొత్త చట్టం కూడా వచ్చింది. దీని ప్రకారం మనం నిత్య జీవితంలో ప్రతి వస్తువు, సేవలు, కొనుగోలు, పొందడంలో ఎక్కడ లోపం, మోసం ఉన్నా వెంటనే వినియోగదారులు ఫోరం ద్వారా నష్టపోయిన వాటిని పొందవచ్చు. జిల్లాలో చాలా మంది ఈ ఫోరాన్ని ఆశ్రయించి న్యాయం పొందారు. అలాగే జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో రక్షణ మండలిలు ఏర్పాటు చేసి, వాటి ద్వారా వినియోగదారులకు రక్షణ కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

హక్కులు తెలుసుకో..

● వస్తువుల కొనుగోలు, వినియోగం విషయంలో వినియోగదారులకు కొన్ని రకాల హక్కులు ఉన్నాయి.

● వస్తువుల నాణ్యత, పనితీరు, సేవల గురించి పూర్తి సమాచారం పొందే హక్కు వినియోగదారులకు ఉంది.

● హక్కులు ఉల్లంఘిస్తే పరిష్కారం కోరే హక్కు వినియోగదారులకు ఉంది.

● తప్పుగా మార్కెట్‌ చేసే వస్తువులు, సేవల నుంచి రక్షణ కల్పించే హక్కు వినియోగదారులకు ఉంది.

● దేశంలో ఎక్కడ వస్తువు కొన్నా, ఎక్కడ సేవా లోపం ఉన్నా ఆ వినియోగదారుడు నివసించే ప్రదేశం, ఉద్యోగం చేసే జిల్లా పరిధిలో కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

● నేషనల్‌ కన్స్యూమర్‌ హెల్ప్‌లైన్‌ (ఎన్‌సీహెచ్‌) మొబైల్‌ యాప్‌లో కూడా బాధితులు ఫిర్యాదు చేయవచ్చు.

● వస్తు సేవలతో పాటు బీమా పాలసీలు, చిట్‌ఫండ్‌లు, మ్యూచువల్‌ ఫండ్‌లు, సేవింగ్‌లు, బ్యాంకు బీమాలు, అలాగే స్కీంల విషయంలో మోసం, లేదా నిర్లక్ష్యం చేస్తే వినియోగదారులు ఫోరంలో ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చు.

కోర్టు ఉంది

జిల్లాలో వినియోగదారుల సమాఖ్య (కోర్టు) ఉంది. ఈ కోర్టులో ప్రతి రోజు కేసుల విచారణ ఉంటుంది. ఈ ఫోరంలో నేరుగా బాధితుడు ఫిర్యాదు చేయవచ్చు. లేదా ఫో రం సభ్యులను ఆశ్రయించి వారి ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అందుబాటులో ఉన్న న్యాయవాది ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీనికి కేవలం నష్టం, ఇబ్బంది జరిగిందని రుజువులు ఉంటే చాలు. జిల్లాలో ప్రధానంగా వస్తు, సేవలకు సంబంధించి 107 కేసులు ఈ కోర్టులో ఉన్నాయి.

నేషనల్‌ కన్స్యూమర్‌ హెల్ప్‌ లైన్‌ యాప్‌

ఇలా ఫిర్యాదు చేయాలి..

1915,1800114000 టోల్‌ ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేసి సమస్య చెబితే వారు జిల్లా స్థాయి కమిషన్‌కు తెలియజేస్తారు.

వస్తువు కొనేటప్పుడు ఇన్‌వాయిస్‌లు, ఐడీలను కచ్చితంగా నిక్షిప్తం చేయాలి. ఫిర్యాదు సమయంలో అవే ఆధారాలు.

ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయించినా, నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవా లోపానికి పాల్పడినా నేరుగా వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేసే విధంగా కేంద్ర మంత్రిత్వ శాఖ వెసులుబాటు కల్పించింది.

వాట్సాప్‌ నంబర్‌ 88000 01915 లో మొదట హాయ్‌ అని టైప్‌ చేయాలి. అక్కడి సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్‌ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు నమోదవుతుంది.

తెలుసుకో హక్కు.. చట్టమే దిక్కు

జిల్లాలో విచ్చలవిడిగా తూకాల్లో మోసాలు.. కొలతల్లో తేడాలు

మోసపోతున్న కొనుగోలుదారులు

హక్కులపై అవగాహన

పెంచుకోవాలంటున్న నిపుణులు

కొను‘గోల్‌మాల్‌’

శ్రీకాకుళం ఆర్టీసీ కాంపెక్స్‌కి సమీపంలో, ఎస్పీ కార్యాలయం పక్కన ఓ దుకాణం వద్ద కిలో నల్ల ద్రాక్షపండ్లు కొనుగోలు చేశా ను. ధర రూ.150 తీసుకున్నారు. ఆ పండ్లను నెహ్రూ యువ కేంద్రానికి సమీపంలో ఓ దుకాణం వద్ద మళ్లీ తూకం వేయించాను. అక్కడ 840 గ్రామలు మాత్రమే ఉంది.

– సీహెచ్‌ రామకృష్ణ, ప్రొఫెసర్‌, ఏఎస్‌ఎన్‌కాలనీ, శ్రీకాకుళం నగరం

టెక్కలి పాత బస్టాండ్‌లో ఓ కిరాణా దుకాణంలో పాత తరం తూకాలు, కొత్త తరం ఎలక్ట్రానిక్‌ తూకాలతో సామాన్లు విక్రయిస్తున్నారు. అయితే పాత తరం తూకాలకు వినియోగిస్తున్న గుండ్లు పూర్తిగా కాల పరిమితి దాటి ఉన్నాయి. ‘సాక్షి’ పరిశీలనలో భాగంగా కిలో వస్తువులకు సుమారుగా 100 నుంచి 150 గ్రాముల వరకు తేడా కనిపిస్తోంది. వీటితో పాటు మొదటి రకం గ్రేడ్‌ పేరుతో నాశిరకమైన నిత్యావసర సామగ్రిను అసలు ధరలకు అమ్మకాలు చేస్తున్నారు.

టెక్కలిలో ఓ బంగారు దుకాణంలో అమ్మకాలు చేస్తున్న బంగారం, వెండి వస్తువుల విషయా న్ని పరిశీలించగా నాసిరకమైన వెండి వస్తువులకు అసలు ధరను వసూలు చేస్తున్నారు. అలాగే బంగారం బరువు తూచే క్రమంలో వినియోగిస్తున్న డిజిటల్‌ తూకాల్లో అంకెల గారడీ కనిపిస్తోంది.

టెక్కలిలో ఓ మందుల దుకాణంలో ఓ వినియోగదారుడు కొన్ని రకాల మందులు కొనుగోలు చేశాడు. అయితే ఇంటికి వెళ్లి పరిశీలించగా అవి కాలం చెల్లినవిగా గుర్తించాడు. దీంతో ఆయా మందుల దుకాణదారుడి వద్దకు వెళ్లి నిలదీయగా వాటిని మార్పు చేసి కొత్త తేదీలతో ఉన్న మందులను ఇచ్చాడు.

కొలతలో తేడా..

ఏసీబీ కార్యాలయం బలగ వద్ద చేపల మార్కెట్‌లో కిలోన్నర రొయ్యలు కొన్నాను. కానీ తూకం తక్కువగా ఉన్నట్లు అనుమానం వచ్చింది. సమీపంలోగల ఓ చికెన్‌ షాపు వద్దకు వెళ్లి డిజిటల్‌ కాటాలో మళ్లీ తూయిస్తే 1.290 గ్రాములు ఉంది. ఇదేంటని అడిగితే నచ్చితే కొనండి అని సమాధాన మిస్తున్నారు. – ఎన్‌.శ్రీనివాసరావు,

డీసీసీబీ కాలనీ, కొనుగోలుదారుడు

నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం1
1/7

నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం2
2/7

నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం3
3/7

నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం4
4/7

నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం5
5/7

నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం6
6/7

నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం7
7/7

నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement