శ్రీకాకుళం న్యూకాలనీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీడీ–పీఈటీ అసోసియేషన్ కోశాధికారిగా మొజ్జాడ వెంకటరమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో ఆదివారం జరిగిన రాష్ట్ర పీడీ–పీఈటీ సంఘ విస్తృతస్థాయి సమావేశంలో ఈ మేరకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇప్పటివరకు ఈయన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా సేవలు అందించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా పీడీ, పీఈటీ సంఘ అధ్యక్షుడిగా గత పదేళ్ల నుంచి విశేషమైన సేవలు అందిస్తున్నారు. ఈయన నియామకంపై ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ధర్మాన కృష్ణదాస్, ఎం.సాంబమూర్తి, చీఫ్ అడ్వైజర్ పి.సుందరరావు, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ, గ్రిగ్స్ సెక్రటరీ కె.మాధవరావు, గ్రిగ్స్ జోనల్, జిల్లా సంఘ ప్రతినిధులు, పీడీలు హర్షం వ్యక్తం చేశారు.
ఎంవీ రమణ