
ధూప దీప నైవేద్యాల కోసం ప్రభుత్వం ఇస్తున్న సొమ్మును పెంపు చేయడం చాలా ఆనందం. గతంలో 95 దేవాలయాలకు మాత్రమే ఇచ్చేవారు. ఈ ప్రభుత్వ హయాంలో దాన్ని 121 దేవాలయాలకు పెంచారు. ఈ సంఖ్య ఇంకా పెంచాలని కోరుతున్నాం.
– పెంట శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర అర్చక సంఘం, అధ్యక్షుడు
ఆదేశాలు అమలు చేస్తున్నాం
అర్చకుల వెల్ఫేర్ కోసం ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వులు సమర్థంగా అమలు చేస్తున్నాం. 98 అర్చకులకు వంశపారంపర్య హక్కు కల్పించాం. 59 మంది అర్చకులకు జీతాలు పెరిగాయి. ప్రస్తుతం 713 దేవాలయాలు పలువురు అర్చకులు, గ్రామ కమిటీల ద్వారా నిర్వహణలో ఉన్నాయి. – బీఆర్‌వీవీ ప్రసాద్‌పట్నాయిక్, జిల్లా దేవాదాయశాఖ అధికారి
●
