ఆమదాలవలస: ఆమదాలవలస మున్సిపల్ ప్రత్యేకాధికారిగా శ్రీకాకుళం జెడ్పీ సీఈఓ ఆర్.వెంకట్రామన్‌ను నియమిస్తూ బుధవారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆమదాలవలస మున్సిపల్ ప్రత్యేకాధికారిగా శ్రీకాకుళం ఆర్‌డీఓ బి.శాంతి కొనసాగారు. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకపోవడంతో మున్సిపాలిటీలో ప్రత్యేకాధికారితో అభివృద్ధికి సంబంధించి లావాదేవీలు జరుగుతున్నాయి. పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రత్యేకాధికారులను మార్చినట్లు సమాచారం. ప్రస్తుతం మున్సిపల్ ప్రత్యేకాధికారిగా నియమితులైన జెడ్పీ సీఈఓ 2024 జనవరి 2 వరకు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.