
మాట్లాడుతున్న డైరెక్టర్ ప్రసాదరావు
శ్రీకాకుళం కల్చరల్: యుగ కవి గురజాడ అప్పారావు 121వ జయంతి సభ గురువారం సాయంత్రం 5 గంటలకు శ్రీకాకుళం ఎన్జీవో హోంలో నిర్వహిస్తున్నట్లు అభ్యదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు ఒక ప్రకటనలో తెలిపారు. సంఘం జాతీయ అధ్యక్షులు, రచయిత, సాహితీ విమర్శకులు పెనుగొండ లక్ష్మీనారాయణ, ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు, అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు. గురజాడ అభిమానులంతా హాజరుకావాలని కోరారు.
సబ్ కలెక్టర్‌ను కలిసిన డీఎస్పీ
టెక్కలి: టెక్కలి సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నూరుల్‌కమార్‌ను డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల అంశాలను ప్రస్తావించారు.
పశువుల కంటైనర్ సీజ్
జలుమూరు: నారాయణవలస సంత నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న 79 పశువులతో కూడిన కంటైనర్‌ను సీజ్ చేశామని ఎస్‌ఐ పి.పారినాయుడు బుధవారం తెలిపారు. ఎస్‌ఈబీ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు లింగాలవలస వద్ద మాటువేసి కంటైనర్‌ను స్వాధీనం చేసుకుని పశువులను కొత్తవలస గోశాలకు తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనలో రాజస్థాన్‌కు చెందిన సలీమ్, హర్యానాకు చెందిన మొఫిద్దన్‌లపై కేసు నమోదు చేశామన్నారు.
ఉత్తమ ఫలితాల సాధనే ధ్యేయం
టెక్కలి: రానున్న పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని టెక్కలి ఉప విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ సూచించారు. పాతనౌపడ సమీపంలో ప్రణవి కళాశాలలో డివిజన్ పరిధిలోని ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో టెక్కలి డివిజన్ ద్వితీయస్థానం సాధించిందని, అదే స్ఫూర్తితో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. పాఠశాలల్లో అమలవుతున్న జగనన్న గోరుముద్ద, నాడు–నేడు పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం పాఠశాలలో అమలవుతున్న గ్రీన్‌కోర్‌కు సంబంధించి పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో డీసీఈబీ కార్యదర్శి జి.రాజేంద్రప్రసాద్, పరీక్షల విభాగం కన్వీనర్ డి.లక్ష్మినారాయణ, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు వి.సత్యనారాయణ, కోశాధికారి చిలుకు కృష్ణారావు, రామకృష్ణ, కె.నగేష్, ప్రకాశ్, రమేష్, బెనర్జీ పాల్గొన్నారు.
అక్షరాస్యతతో పేదరికం దూరం
శ్రీకాకుళం న్యూకాలనీ: సంపూర్ణ అక్షరాస్యతతోనే సమాజంలో పేదరికం దూరమవుతుందని యూత్ క్లబ్ బెజ్జిపురం డైరెక్టర్ ఎం.ప్రసాదరావు అన్నారు. అక్షరాస్యతతో అంతరాలు తొలగిపోయి ఆర్థిక స్థితిగతులు మారి అభివృద్ధి సాకారమవుతుందని చెప్పారు. బెంగళూరుకు చెందిన ఇండియా లిటరసీ ప్రాజెక్ట్ సహకారంతో నిర్వహిస్తున్న స్కూల్ రెడీనెస్ బాలవికాస్ ప్రోగ్రామ్స్‌లో భాగంగా శ్రీకాకుళంలోని యూత్‌క్లబ్ బెజ్జిపురం కార్యాలయం వద్ద 35 మంది క్లస్టర్ రిసోర్స్ పర్సన్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. శ్రీకాకుళం రూరల్, గార, ఎచ్చెర్ల, జి.సిగడాం, లావేరు, రణస్థలం, పొందూరు మండలాల్లోని రిసోర్స్ పర్సన్లకు విధులు, బాధ్యతల నిర్వహణపై అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులను గుర్తించి చదువుకునేలా సన్నద్ధత చేయడమే మన లక్ష్యమన్నారు. శతశాతం అక్షరాస్యత సాధనలో సీఆర్పీల పనితీరు అభినందనీయమని జి.అప్పలనాయుడు, టి.కరుణకారరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో వై.శంకరరావు, రమణమూర్తి, ఆర్.కల్పన, హేమసుందర్, సంతోషి, సోషల్ వర్క్ విద్యార్థులు పాల్గొన్నారు.

నూరుల్ కమార్‌తో డీఎస్పీ బాలచంద్రారెడ్డి

గ్రీన్‌కోర్ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఉప విద్యా శాఖాధికారి పగడాలమ్మ