న్యూస్‌రీల్
ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ద్వారా అందే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో నిర్వహించి ‘పరిష్కార వేదిక’లో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్‌ఓ కొండయ్య తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తంగా 237 అర్జీలు అందగా, వాటి పరిష్కారం నిమిత్తం ఆయా శాఖలకు పంపారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్ అధికారులతో సమావేశమయ్యారు.
ఇంజినీర్ ఇంట్లో కొండ చిలువ!
పెనుకొండ: పట్టణంలోని తోటగేరిలో వ్యవసాయ పొలంలో నివసిస్తున్న ఇంజినీర్ జగదీష్ ఇంటి ఆవరణలోకి ఆదివారం రాత్రి కొండ చిలువ చొరబడింది. ఒక కోడిని మింగేసి ఆవరణలోని ఓ చిన్న షెడ్డులో పడుకుంది. సోమవారం ఉదయం కొండచిలువను గమనించిన జగదీష్... వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చాకచక్యంగా దాన్ని పట్టుకుని సమీప అటవీప్రాంతంలో వదిలేశారు.


