మలకవేమల పీహెచ్‌సీ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

మలకవేమల పీహెచ్‌సీ తనిఖీ

May 31 2026 12:12 AM | Updated on May 31 2026 12:12 AM

ముదిగుబ్బ: మండలంలోని మలకవేమల పీహెచ్‌సీని శనివారం డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఫైరోజాబేగం తనిఖీ చేశారు. పలు రికార్డులు, పీహెచ్‌సీ పరిసరాలు పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డాక్టర్‌ చైతన్య, ఎంపీహెచ్‌ఈఓ వేణుగోపాలరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

శేషజీవితం ప్రశాంతంగా గడపాలి : ఎస్పీ

పుట్టపర్తి టౌన్‌: ఉద్యోగ విరమణ సర్వసాధారణమని, ఇంత కాలం తీవ్ర ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వర్తించిన వారు ఇకపై శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ఎస్పీ సతీష్‌కుమార్‌ ఆకాంక్షించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఐ రహిమాన్‌, ఎస్‌ఐ బ్రహ్మానందరెడ్డి, ఏఎస్‌ఐ సోమశేఖర్‌, హెడ్‌సీ అల్లాబకాష్‌ శనివారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా వారిని డీపీఓలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్‌ శాఖకు వారి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఐ వలి, ఆర్‌ఎస్‌ఐలు ప్రదీప్‌సింగ్‌, వీరన్న, ప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement