పోలీస్‌ క్రికెట్‌ టోర్నీ విజేత కేజీఎఫ్‌ జట్టు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ క్రికెట్‌ టోర్నీ విజేత కేజీఎఫ్‌ జట్టు

May 31 2026 12:12 AM | Updated on May 31 2026 12:12 AM

కదిరి అర్బన్‌: స్థానిక ఎస్టీఎస్‌ఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో వారం రోజులుగా సాగుతున్న పోలీస్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ శనివారం ముగిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 16 జట్లు పాల్గొనగా, శనివారం జరిగిన ఫైనల్స్‌లో క్యాంప్‌ జట్టుపై కేజీఎఫ్‌ జట్టు విజయం సాధించి ంది. ముగింపు కార్యక్రమానికి ఎస్పీ సతీష్‌కుమార్‌, ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌ హాజరై విజేతలకు ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు నారాయణరెడ్డి, నాగేంద్రప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

క్రీడలతో మంచి భవిష్యత్తు : ఎస్పీ

క్రీడలతో మంచి భవిష్యత్తు ఉంటుందని ఎస్పీ సతీష్‌కుమార్‌ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నెల రోజులుగా సాగుతున్న టేబుల్‌ టెన్నిస్‌ వేసవి శిక్షణా శిబిరం శనివారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై, శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ స్మిత, డీఎస్పీ శివనారాయణస్వామి, పీడీ నరసింహాచారి, తదితరులు పాల్గొన్నారు.

మహానాడులో

హౌసింగ్‌ వర్క్‌ఇన్‌స్పెక్టర్‌

చిలమత్తూరు: మండలంలోని కోడూరులో ఇటీవల నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో గోరంట్ల హౌసింగ్‌ శాఖలో వర్క్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న మల్లికార్జున పాల్గొనడం చర్చనీయాంశమైంది. మహానాడులో మల్లికార్జున సందడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement