పుట్టపర్తి అర్బన్: స్థానిక ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. నలుపు షర్టు, మెడలో పచ్చ దారంతో కూడిన తాయత్తు తప్ప ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. శనివారం ఉదయం బసవ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా రైల్వే పోలీసులు నిర్ధారించారు. ఆచూకీ తెలిసిన వారు 91820 19510 కు సమాచారం ఇవ్వాలని కోరారు.
తాటిచెట్టుపై పిడుగు
బత్తలపల్లి: మండలంలో శనివారం సాయంత్రం కురిసిన మోస్తారు వర్షానికి నల్లబోయనపల్లి గ్రామ శివారున ఉన్న తాటిచెట్టుపై పిడుగు రాలింది. దీంతో తాటిచెట్టుపై మంటలు ఎగిసిపడ్డాయి. సంజీవపురం గంగమ్మ ఆలయం, ఎస్సీ కాలనీలోని ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది.


