ఇన్ సర్వీస్ టీచర్లకు ‘టెట్’ తప్పని సరి చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో చాలా మంది ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అందువల్ల సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్..గతంలోనే ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లేని పక్షంలో రాష్ట్రంలో లక్షలాది మంది టీచర్లు నష్టపోతారు.
– కల్పలతారెడ్డి,
ఎమ్మెల్సీ
ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు వల్ల జిల్లాలో వేలాది మంది టీచర్లు ఆందోళకు గురవతున్నారు. ఇన్‌సర్వీస్ టీచర్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పార్లమెంట్‌లో చట్ట సవరణ కోసం బిల్లు ప్రవేశ పెట్టాలి. అప్పుడే టీచర్లకు న్యాయం జరుగుతుంది. ఇది తప్ప వేరే గత్యంతరం లేదు.
– శెట్టిపి జయచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, యూటీఎఫ్


