విపత్తులు, కరువు కాటకాలు, రోడ్డు, రైలు ప్రమాదాలు, విద్యుదాఘాతాలు, కుక్కల దాడి.. ఇలా ఏదో ఒక కారణంతో తరచూ జిల్లాలో ఎక్కడో ఓ చోట జీవాలు, పశువులు చనిపోతూనే ఉన్నాయి. ఈ ప్రభుత్వం పశుబీమా సక్రమంగా అమలు చేయకపోవడంతో పశుపోషకులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. జగనన్న ప్రభుత్వంలో జిల్లాలో రూ.10 కోట్ల దాకా పశుబీమా అందించింది. – ఉషశ్రీ చరణ్,
జిల్లా అధ్యక్షురాలు, వైఎస్సార్‌సీపీ
నిధులు విడుదల కావాల్సి ఉంది
బీమా ప్రీమియంలో ప్రభుత్వం 85 శాతం రాయితీ ఇస్తూ పశుబీమాను అమల్లోకి తెచ్చింది. రైతు 15 శాతం మొత్తం చెల్లిస్తే చాలు. కాకపోతే ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది. అందుకే కొంతకాలంగా బీమా చేయడం లేదు. పిడుగులు పడటం, ఇంకా పలు కారణాలతో గొర్రెలు, మేకలు, పశువులు చనిపోయిన మాట వాస్తవమే. బీమా వర్తింపజేస్తే వారికి కొంత ఊరట లభిస్తుంది.
– పెంచలయ్య, జేడీ, పశుసంవర్ధకశాఖ


