పరిగి: మండల కేంద్రంలో వెలసిన పన్నేడమ్మ (సప్తమాత్రుక) అమ్మవారి జాతర శుక్రవారంతో ముగిసింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత జాతర నిర్వహించడంతో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. రెండు రోజుల పాటూ వివిధ ఆధ్యాత్మిక కొనసాగాయి. శుక్రవారం చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం గోపుర కలశ ప్రతిష్ఠాపన, చండీ యాగం, మహాబలి సమర్పణ, మహా పూర్ణాహుతి, మహా నీరాజనం అనంతరం 9 గంటల నుంచి దీపోత్సవం ప్రారంభమైంది. మహిళలు జ్యోతులను సమర్పించారు.
అమ్మవారి సేవలో ఉష శ్రీచరణ్
శుక్రవారం జరిగిన జాతర మహోత్సవంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉష శ్రీచరణ్ పాల్గొన్నారు. తొలుత పన్నేడమ్మ ఆలయ ప్రాంగణం వరకూ జ్యోతులను తలపై పెట్టుకుని తీసుకెళ్లారు. అనంతరం జ్యోతులను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సప్తమాత్రుక అమ్మవారి కరుణతో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. రాత్రి జరిగిన గ్రామోత్సవంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు.
చివరి రోజు అట్టహాసంగా సాగిన గ్రామోత్సవం
తరలివచ్చిన వేలాది మంది భక్తులు


