42 అర్జీలకు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

42 అర్జీలకు పరిష్కారం

May 30 2026 8:53 AM | Updated on May 30 2026 8:53 AM

పుట్టపర్తి అర్బన్‌: ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా శుక్రవారం నల్లమాడ ఎంపీడీఓ కార్యాలయంలో ‘ఒక నెల–ఒక నియోజక వర్గం– నాలుగు పర్యటనలు’ కార్యక్రమాన్ని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జేసీ మౌర్య భరద్వాజ్‌తో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో గతవారం అందిన అర్జీల పరిష్కారంపై చర్యలు చేపట్టారు. గత వారం 77 అర్జీలు అందగా... 42 అర్జీలను పరిష్కరించడంతో పాటు పరిష్కార పత్రాలను అర్జీలకు అందజేశారు. ముఖ్యంగా వేళ్లమద్ది పరిధిలోని ఎర్రవంకపల్లి గ్రామంలో సుదీర్ఘకాలంగా ఉన్న రస్తా సమస్యను పరిష్కరించారు. అలాగే బొగ్గలపల్లి గ్రామంలో శ్మశాన వాటిక కోసం అవసరమైన భూమిని కేటాయించారు. ఇక కురుమాల గ్రామ పొతంలో 150 ఎకరాల భూ సమస్యతో రైతులు ఇబ్బంది పడుతుండగా... రైతులకు న్యాయం చేస్తూ సదరు భూమిని రిజిస్టర్‌ను పూర్తిగా తొలగించారు. కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, తహసీల్దార్‌ మనోజ్‌కుమార్‌రెడ్డి, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement