మడకశిర: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితగా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రవిశేఖర్‌రెడ్డి, వాగేష్ విమర్శించారు. గురువారం మడకశిరలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైఎస్ జగన్ హయాంలో రాప్తాడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పరిటాల సునీతకు భద్రతను పెంచారే కానీ తగ్గించలేదని గుర్తు చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యేతోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి గన్‌మెన్లను తొలగించడాన్ని చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుల చర్యల్లో భాగంగానే పరిగణించాల్సి వస్తోందన్నారు. తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డిపై హత్య కేసు నమోదు చేయడాన్ని ఖండించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిపత్యం సాధించడానికే కుట్ర పూరితంగా వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా కుట్ర పూరిత రాజకీయాలకు స్వస్తి పలకకపోతే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కక్ష సాధింపుల భాగంగానే
గన్‌మెన్ల తొలగింపు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త
కార్యదర్శులు రవిశేఖర్‌రెడ్డి, వాగేష్


