కడప వైఎస్పార్ సర్కిల్: ఆంఽధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) టోర్నీ వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలిసారిగా ఈ పోటీలను రాష్ట్రంలోని మూడు వేర్వేరు వేదికల్లో నిర్వహించనున్నారు. విశాఖపట్నంతో పాటు కడప, మంగళగిరి స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మంగళగిరిలో ఫైనల్స్ నిర్వహించనున్నారు.
కడప వేదికగా తొమ్మిది మ్యాచ్‌లు...
జూన్ 17 నుంచి 21వ తేదీ వరకూ ఐదు రోజులపాటు మొత్తం కడపలో 9 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇందుకు వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. మూడేళ్ల క్రితం స్టేడియంలో రూ.8 కోట్ల వ్యయంతో ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ డే అండ్ నైట్ మ్యాచ్ ఒక్కటి కూడా నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఫ్లడ్ లైట్ల వెలుగులో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లను నిర్వహించేలా జిల్లా క్రికెట్ సంఘం చేసిన కృషి ఫలించింది. తొలిసారిగా ఫ్లడ్ లైట్ల వెలుగులో ఏపీఎల్ మ్యాచ్‌లను నిర్వహిస్తుడటంతో క్రీడాభిమానుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇప్పటికే మ్యాచ్‌ల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా క్రికెట్ అసోసియేషన్ చేస్తుంది.
మూడు వేదికల్లో ఐదో సీజన్ నిర్వహణ
మంగళగిరిలో ఫైనల్స్


