భక్తిశ్రద్ధలతో.. బక్రీద్‌ పర్వదినం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో.. బక్రీద్‌ పర్వదినం

May 29 2026 2:37 AM | Updated on May 29 2026 2:37 AM

జిల్లా వ్యాప్తంగా బక్రీద్‌ ను ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం ఉదయం నుంచే ఆయా ప్రాంతాల్లోని ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు బక్రీద్‌ పండుగ విశిష్టత, మత ప్రాముఖ్యతను వివరించారు. ప్రవక్త హజ్రత్‌ ఇబ్రహీం చూపిన అపారమైన దైవభక్తి, త్యాగ నిరతిని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సమాజంలో శాంతి, కరుణ, సోదరభావం పెంపొందించుకోవాలని, ఉన్నదానిలో పేదలకు సహాయం చేయడమే ఈ పండుగ యొక్క అసలైన అంతరార్థమన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం ఒకరికొకరు ‘‘ఈద్‌ ముబారక్‌’’ అంటూ ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. – సాక్షిబృందం

Advertisement
 
Advertisement
Advertisement