వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు

May 29 2026 2:37 AM | Updated on May 29 2026 2:37 AM

పుట్టపర్తి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురు నాయకులను వివిధ రాష్ట్ర అనుబంధ సంఘాల కమిటీల్లో చోటు కల్పించారు. బూత్‌ కమిటీల వింగ్‌ రాష్ట్ర సెక్రెటరీగా మడకశిరకు చెందిన జీఎస్‌.రంజిత్‌కుమార్‌, పంచాయతీ రాజ్‌ వింగ్‌ రాష్ట్ర సెక్రెటరీగా కదిరికి చెందిన దేశాయి భక్తవత్సలరెడ్డి, పంచాయతీరాజ్‌ వింగ్‌ రాష్ట్ర అఫీషియల్‌ స్పోక్స్‌ పర్సన్‌గా కదిరికి చెందిన యనమల ఆనంద్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర సెక్రెటరీలుగా పుట్టపర్తికి చెందిన టీడీ కేశవరెడ్డి, మడకశిరకు చెందిన ఎస్‌.రామిరెడ్డి , రైతు విభాగం రాష్ట్ర జాయింట్‌ సెక్రెటరీలుగా కదిరికి చెందిన పోరెడ్డి వెంకటరెడ్డి, పుట్టపర్తికి చెందిన బి.మాధవరెడ్డిలను నియమించారు. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

టీబీ డ్యాంలో

10 టీఎంసీల నీరు

బొమ్మనహాళ్‌: ఆంధ్రా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్‌, అనంతపురం జిల్లా ప్రజల వర ప్రదాయిని తుంగభద్ర జలాశయం (టీబీ డ్యాం)లో 10.140 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 2025 డిసెంబర్‌ 27న నిలిచిపోయిన ఇన్‌ఫ్లో డ్యాం ఎగువ ప్రాంతాల్లో ఈ నెల 19 నుంచి కురుస్తున్న వర్షాలతో మళ్లీ ప్రారంభమైంది. ఆశించిన రీతిలో వర్షాలు కురిస్తే జూన్‌ లేదా జూలైలో పూర్తి స్థాయిలో నీరు చేరుతుంది. డ్యాం నీటి మట్టం 1,633 అడుగులతో 105.788 టీఎంసీల నిల్వ సామర్థ్యం కాగా.. గురువారానికి 1,588.91 అడుగులతో 10.140 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 623 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 54 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి 1,590.76 అడుగుల వద్ద 11.680 టీఎంసీల నీరు నిల్వ ఉండి 2,574 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 131 క్యూసెక్కుల అవుట్‌ ఫ్లో ఉండింది.

‘మహానాడు’లో పాల్గొన్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌

వజ్రకరూరు: స్థానిక మినీ కల్యాణమంటపంలో గురువారం నిర్వహించిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో వజ్రకరూరు గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉస్మాన్‌బాషా పాల్గొనడం చర్చానీయాంశమైంది. పార్టీకి సంబంధించిన ఈ కార్యక్రమంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పాల్గొనడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement