రాయదుర్గం: గుమ్మఘట్ట మండలంలోని జే వెంకటంపల్లిలో తాగునీటి కష్టాలు తారస్థాయికి చేరాయి. రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి తాగునీటి పైపులు కొట్టుకుపోయాయి. ఫలితంగా గ్రామస్తులు బిందెడు నీటికి బండెడు కష్టాలు అనుభవించాల్సి వస్తోంది. పనులన్నీ మానుకుని వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంపై గ్రామ కార్యదర్శి మల్లికార్డునను వివరణ కోరగా వర్షానికి గ్రామంలో పైప్‌లైన్ దెబ్బతిందన్నారు. రెండు రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపుతామని, ఆ లోపు అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీరందిస్తామని చెప్పారు.


