31న జిల్లా ఫుట్‌బాల్‌ జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

31న జిల్లా ఫుట్‌బాల్‌ జట్ల ఎంపిక

May 28 2026 12:16 AM | Updated on May 28 2026 12:16 AM

హిందూపురం టౌన్‌: స్థానిక ఎంజీఎం పాఠశాల క్రీడా మైదానంలో ఈ నెల 31న జిల్లా సబ్‌ జూనియర్‌, జూనియర్‌ బాలుర ఫుట్‌బాల్‌ జట్లను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ బుధవారం వెల్లడించారు. సబ్‌ జూనియర్‌ విభాగంలో 2013 జనవరి నుంచి 2014 డిసెంబర్‌ మధ్య జన్మించిన వారై ఉండాలి. జూనియర్స్‌ విభాగంలో 2011 జనవరి నుంచి 2012 డిసెంబర్‌ మధ్య జన్మించిన వారు అర్హులు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్‌కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, మూడు ఫొటోలు, తల్లితండ్రుల సమ్మతి పత్రం తీసుకుని ఆదివారం ఉదయం 10 గంటలకు క్రీడా మైదానికి చేరుకోవాలి. పూర్తి వివరాలకు 80995 98958 లో సంప్రదించవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement