అగళి: రోడ్డు పక్కన ఆపిన లారీని ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు.. పోలీసులు తెలిపిన మేరకు... కర్టాటకలోని సిరా పట్టణం కోటేలో నివాసముంటున్న దంపతులు తిప్పేస్వామి(60), జయమ్మ రొళ్ల మండలం వట్టేబెట్ట గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. మంగళవారం సాయంత్రం స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన వారు అగళి మండలం పి.బ్యాడగెర సమీపంలోకి చేరుకోగానే జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఆపిన లారీని ఢీకొన్నారు. ఘటనలో తిప్పేస్వామి తలకు, భుజంపై బలమైన రక్తగాయాలయ్యాయి. జయమ్మ తలకు రక్త గాయమైంది. స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్ ద్వారా సిరాలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తుమకూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో తుమకూరు ఆస్పత్రిలో తిప్పేస్వామి మృతి చెందాడు. జయమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై అగళి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


