చెట్ల తొలగింపుపై కలెక్టర్‌ ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

చెట్ల తొలగింపుపై కలెక్టర్‌ ఆగ్రహం

May 26 2026 8:06 AM | Updated on May 26 2026 8:06 AM

చిలమత్తూరు: మండల పరిధిలోని మరవకొత్తపల్లి సమీపంలో సుమారు 200 చింత చెట్ల తొలగింపుపై కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా మరవకొత్తపల్లి సమీపంలో 200 చింత చెట్ల తొలగింపుపై ఆదివారం ‘పర్యావరణంపై గొడ్డలి వేటు’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురితమైంది. అదే అంశంపై సోమవారం పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో పర్యావరణవేత్త భాస్కర్‌రెడ్డి ఫారెస్ట్‌ అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చెట్లు అనుమతుల కోసం ఇచ్చిన ఆర్డర్‌ను రద్దు చేయడంతో పాటు సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అటవీశాఖ అధికారులపై ఆగ్రహించినట్లు సమాచారం. పర్యావరణాన్ని కాపాడాల్సిన డీఎఫ్‌ఓ వందలాది చెట్లు తొలగించడానికి ఎలా అనుమతులు ఇచ్చారని మండిపడినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement