కదిరి టౌన్: స్థానిక ఎస్టీఎస్‌ఎన్ డిగ్రీ కళాశాలలో 1984–87 డిగ్రీ పూర్తి చేసిన వారు అదే కళాశాల అడిటోరియంలో 40 సంవత్సరాల తర్వాత సోమవారం కలుసుకున్నారు. కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు రాయసం హరిప్రసాద్, అంకె నరహరి, మిత్రులు నేతృత్వం వహించారు. ఒకరి యోగ క్షేమాలను మరొకరు తెలుసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తమ స్నేహితుడు తనకల్లుకు చెందిన ఖాదర్‌బాషాకు ఆర్థిక సాయం అందించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటి అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. భోజన విరామం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. కళాశాల అవరణలో మొక్కలు నాటారు.


