ప్రశాంతి నిలయం: సత్యసాయిని కీర్తిస్తూ సుమధుర స్వరాలతో ఆలపించిన గీతాలు భక్త కోటిని మురిపించాయి. వైట్‌ఫీల్డ్‌లోని సత్యసాయి వైద్య సంస్థలకు చెందిన నర్సింగ్ కాలేజీ అనుబంధ విభాగాల 15వ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం సాయంత్రం ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ మందిరంలో సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ సుమారు గంట పాటు ఈ కార్యక్రమం సాగింది. అనంతరం విద్యార్థులు సత్యసాయి మహా సమాఽధిని దర్శించుకున్నారు.
మహా సమాధిని దర్శించుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
సత్యసాయి మహా సమాఽధిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) వీఎల్ సంతోష్ దర్శించుకున్నారు. పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణలో భాగంగా జిల్లాలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన సాయి కుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ఆయనకు మంత్రి సత్యకుమార్‌యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి, కత్తి రాజారెడ్డి, తదితరులు స్వాగతం పలికారు.


