పెనుకొండ: ఓ ఎలుగుబంటి బారి నుంచి రైతులను శునకాలు కాపాడిన ఘటన పెనుకొండ మండలం గోనిపేటలో జరిగింది. గోనిపేటకు చెందిన పలువురు రైతులు ఆదివారం రాత్రి తమ వ్యవసాయ పొలాల్లో నిద్రిస్తుండగా ఉన్నఫళంగా ఎలుగుబంటి దాడికి యత్నించింది. రైతుల పక్కనే పడుకుని ఉన్న శునకాలు ప్రమాదం గ్రహించి ఎలుగుపై ప్రతిదాడికి దిగాయి. ఈ క్రమంలోనే అటవీ ప్రాంతంలోకి ఎలుగుబంటి పరుగు లంకించింది. దీంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు.
గృహ నిర్మాణ లక్ష్యాన్ని
సాధించాలి
గోరంట్ల: గృహ నిర్మాణ లక్ష్యాన్ని సాధించాలని ఆ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆదివారం గోరంట్లలో జిల్లా హౌసింగ్ అధికారులతో మంత్రులు పార్థసారథి, సవిత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేజ్ కన్వర్షన్ ప్రక్రియను త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రూఫ్ లెవెల్‌కు చేరుకున్న లబ్ధిదారులకు అవసరమైన మెటీరియల్ అందజేయాలన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులతో ఫోన్‌లో మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్‌ఈ కృష్ణయ్య, హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, ఏఈలు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


