● సిబ్బందికి జిల్లా వ్యవసాయాధికారి
నారాయణ నాయక్ ఆదేశం
ధర్మవరం రూరల్: ఖరీఫ్‌లో పంటలు సాగు చేసే రైతులకు ఇబ్బందులు కలగకుండా సకాలంలో విత్తన పంపిణీ చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) నారాయణ నాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ సుబ్బయ్యతో కలిసి ధర్మవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ సాయి సీడ్స్, విజేత అగ్రిటెక్ ప్రాసెసింగ్ ప్లాంట్లను సందర్శించారు. విత్తన శుద్ధి కేంద్రంలో ఏర్పాటు చేసిన స్టోన్ రిమూవర్ యంత్రాన్ని పరిశీలించి సిబ్బందితో వివరాలు ఆరా తీశారు. వీలైనంత త్వరగా విత్తనాలు రైతులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్లాంట్ యజమానులను ఆదేశించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
బీటెక్, ఎం ఫార్మసీ, బీబీఏ ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో నిర్వహించిన బీటెక్, ఎంఫార్మసీ, బీబీఏ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. బీటెక్ రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–23), రెగ్యులర్, సప్లిమెంటరీ, (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ ఫలితాలు, బీటెక్ రెండో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–23), (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ ఫలితాలు, ఎం ఫార్మసీ ఒకటో సెమిస్టర్ (ఆర్–21) రెగ్యులర్, సప్లిమెంటరీ, రెండో సంవత్సరం (ఆర్–21) సప్లిమెంటరీ, బీబీఏ రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ రెగ్యులర్, రెండో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–24) సప్లిమెంటరీ ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి. నాగప్రసాద్ నాయుడు ప్రకటించారు. కార్యక్రమంలో సీఈ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ డాక్టర్ ఎస్.శారద, డాక్టర్ ఎస్.శ్రీధర్ పాల్గొన్నారు. ఫలితాలను జేఎన్‌టీయూ అనంతపురం వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.
ఎస్కేయూలో పలు పదవుల భర్తీ
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో నూతనంగా పలు పదవులను భర్తీ చేశారు. ఈ మేరకు రిజిస్ట్రార్ రమేష్ బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సీడీసీ డీన్‌గా డి.ప్రభాకర్, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్‌గా ఎంవీ లక్ష్మయ్య, ఫార్మాసూటికల్స్ డైరెక్టర్‌గా సి.సురేష్‌కుమార్, యూజీసీ డీన్‌గా జి.నరసింహన్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్‌గా జీవీ రమణ, అడిషనల్ వార్డెన్ (మెన్) సదాశివారెడ్డి, అడిషనల్ వార్డెన్ (ఉమెన్) ఖేజియారాణి, ఉమెన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్‌గా ఎస్.అనిత, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్‌ను దాశరథి రవీంద్ర, పీఆర్వోగా డాక్టర్ మాధవిని నియమించారు.


