అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తుకు గడువు ఉంది. ఈ కోర్సులకు చాలా డిమాండ్ ఉంది. మా కళాశాలలో చదివిన పిల్లలు చాలా మంది ఉద్యోగాల్లో ఉన్నారు. కోర్సు పూర్తయిన తర్వాత కేవలం ఉద్యోగాలే కాకుండా అధునాతన వ్యవసాయం, డెయిరీ ఫాం, పాడి, ఎరువుల కంపెనీలు తదితర రంగాల్లో రాణించవచ్చు. పూర్తి వివరాలకు రెడ్డిపల్లి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించవచ్చు.
– డాక్టర్ వసుంధర, ప్రిన్సిపాల్, రెడ్డిపల్లి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల


