గంజాయి విక్రేత అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రేత అరెస్టు

May 23 2026 1:52 AM | Updated on May 23 2026 1:52 AM

గుత్తి: పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన తపిల రఘు అనే గంజాయి విక్రేత, మట్కా బీటరును శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 1,10,000 నగదుతో పాటు 50 గ్రాముల గంజాయి, మట్కా చీటీలు, బాల్‌ పెన్నులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో సీఐ రామారావు, ఎస్‌ఐ సురేష్‌ మాట్లాడుతూ గతంలో కొందరు గంజాయి విక్రేతలను అరెస్టు చేశామన్నారు. అయితే తపిల రఘుతో పాటు మరో ఇద్దరు పరారయ్యారన్నారు. వారిలో తపిల రఘును అరెస్టు చేశామన్నారు. మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement