రాయదుర్గంటౌన్: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఇలాకాలో తాగునీటి కష్టాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాలకు చెందిన మహిళలు నీటి కోసం రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. తాజాగా శుక్రవారం పట్టణంలోని మొలకాల్మూరు రహదారిపై మహిళలు, కాలనీవాసులు ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. వారం రోజులవుతున్నా నీరు సరఫరా చేయకపోతే నీటి అవసరాలు ఎలా తీరుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చెప్పి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.


