హోరాహోరీగా రాతిదూలం పోటీలు | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా రాతిదూలం పోటీలు

May 23 2026 1:52 AM | Updated on May 23 2026 1:52 AM

పెద్దవడుగూరు: మండల పరిధిలోని ఆవులాంపల్లిలో శుక్రవారం జాతీయస్థాయి ఒంగోలు జాతి వృషభాల రాతిదూలం లాగుడు పోటీలు ప్రారంభమయ్యాయి. రెండవరోజు న్యూ కేటగిరి విభాగంలో వృషభాల పోటీలు ప్రారంభం కాగా పోటీల్లో 17 జతలు పాల్గొన్నాయి. హోరా హోరీగా జరిగిన పోటీలో మొదటిస్థానంలో కడప జిల్లా చౌటపల్లె మూర్థల చంద్ర ఓబుళరెడ్డి, రెండో స్థానంలో పల్నాడు జిల్లా ఇర్లపాడు మంగు రమాదేవి, మూడో స్థానంలో అనంతపురం జిల్లా ఏ.నారాయణపురంకు చెందిన షేక్‌ మహ్మద్‌ ఫరీద్‌ ఎద్దులు నిలిచాయి. వారికి వరుసగా రూ.70 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు నగదు బహుమతులను అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement