చంద్రబాబు ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించింది. ఎరువుల ధరలు అమాంతం పెరిగినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నా విత్తన పంపిణీపై మౌనం పాటిస్తోంది. ఇప్పటికే చాలా మంది రైతులు దుక్కులు చేసుకున్నారు. రెండు రోజుల నుంచి జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో సేద్యం పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. కానీ ప్రభుత్వం ఇప్పటికీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించలేదు. విత్తనం ధర కూడా గత ఏడాదితో పోలిస్తే రూ. 200 మేర పెంచింది. ఇక అన్నదాత సుఖీభవ నిధులు ఎప్పుడు జమ చేస్తుందో కూడా చెప్పడం లేదు.
– నరసింహారెడ్డి, రైతు, వెంకటగారిపల్లి


