దొంగ ఓట్లు ఎక్కిస్తారు జాగ్రత్త! | - | Sakshi
Sakshi News home page

దొంగ ఓట్లు ఎక్కిస్తారు జాగ్రత్త!

May 21 2026 4:57 AM | Updated on May 21 2026 4:57 AM

చిలమత్తూరు: ‘‘టీడీపీ రెండేళ్ల పాలనతో జనం విసిగిపోయారు. ఏ ఎన్నిక వచ్చినా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకే అధికార పార్టీ అక్రమాలకు ప్లాన్‌ వేసింది. వైఎస్సార్‌ సీపీ మద్దతుదారుల ఓట్లు అక్రమంగా తొలగించడంతోపాటు దొంగ ఓట్లు భారీగా చేర్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందువల్ల బూత్‌లెవల్‌ ఏజెంట్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. అధికార పార్టీ అక్రమాలను సాక్ష్యాలతో అధికారుల ముందు ఉంచి అడ్డుకోవాలి’’ అని వైఎస్సార్‌సీపీ జోన్‌–5 కోఆర్డినేటర్‌ చల్లా మధుసూదన్‌రెడ్డి బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు సూచించారు. బుధవారం ఆయన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్‌ దీపికతో కలిసి హిందూపురం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం ఆవరణలో నియోజకవర్గస్థాయి బూత్‌ లెవెల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎల్‌ఏలకు దిశానిర్దేశం చేశారు. చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ... పార్టీలో బీఎల్‌ఏలదే కీలకపాత్ర అన్నారు. ప్రతి ఓటరు కార్డును క్షుణ్ణంగా పరిశీలించి దొంగ ఓట్లు రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. బూత్‌ లెవెల్‌ ఏజెంట్లును పార్టీ తప్పక గుర్తిస్తుందని, వచ్చే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వారికి వైఎస్‌ జగన్‌ సముచిత గుర్తింపు ఇస్తారన్నారు.

హిందూపురంలో ఎగిరేది

వైఎస్సార్‌ సీపీ జెండానే..

రానున్న అన్ని ఎన్నికల్లో హిందూపురంలో వైఎస్సార్‌ సీపీ జెండానే ఎగురుతుందని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్‌ దీపిక అన్నారు. వైఎస్సార్‌ సీపీకి పట్టం కట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. అందువల్లే అధికార పార్టీ గ్రామాల్లో, వార్డుల్లో వైఎస్సార్‌సీపీ ఓట్లు తొలగించే కుట్రలు చేస్తోందన్నారు. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బూత్‌ లెవెల్‌ కన్వీనర్లు, ఏజెంట్లు గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కేసులకు భయపడవద్దని తాను అండగా ఉంటానని, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మనకు తోడుగా ఉంటారని భరోసా ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకుడు ఫయాజ్‌ భాషా మాట్లాడుతూ... వైఎస్సార్‌సీపీ బలోపేతానికి గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకూ నాయకులు, కార్యకర్తలు కష్టపడాలని సూచించారు. ఈ మూడేళ్లు పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ... క్షేత్రస్థాయిలోని బీఎల్‌ఏలు పార్టీలో క్రియాశీలకంగా ఉంటారని, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి చౌళూరు మధుమతిరెడ్డి, బూత్‌ లెవెల్‌ జోన్‌ –5 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సురేష్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు జీను మహేష్‌, అనుబంధ విభాగాల రాష్ట్ర, నియోజకవర్గ నాయకులు, హిందూపురం పట్టణ, నియోజకవర్గంలోని మండల కన్వీనర్లు, బూత్‌ కమిటీ కన్వీనర్లు, బీఎల్‌ఏలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అధికార పార్టీ అక్రమాలకు సిద్ధమైంది

వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు ప్లాన్‌

బీఎల్‌ఓలు అప్రమత్తంగా ఉండాలి

పనిచేసే ప్రతి కార్యకర్తనూ

పార్టీ తప్పక గుర్తిస్తుంది

బీఎల్‌ఏల సమావేశంలో

చల్లా మధుసూదన్‌రెడ్డి, టీఎన్‌ దీపిక

Advertisement
 
Advertisement
Advertisement