పరిగి: ఒంటరి జీవితాన్ని తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... పరిగి మండలం మోదా గ్రామ ఎస్సీ కాలనీలో నివాసముంటున్న ఆంజనేయులు కుమారుడు సతీష్‌కుమార్ (25)కు ఐదు నెలల క్రితం వివాహమైంది. ఈ నేపథ్యంలో సతీష్‌కుమార్ ఫిట్స్‌తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఆమె భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఒంటరి జీవితాన్ని భరించలేక మనోవేదనకు లోనైన సతీష్‌కుమార్ సోమవారం ఉదయం గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు పరిశీలించి, మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
213 మంది గైర్హాజరు
పుట్టపర్తి: పదో తరగతి పరీక్షల్లో భాగంగా సోమవారం నిర్వహించిన సోషల్ పరీక్షకు 213 మంది విద్యార్థులు గైర్హాజౖరయ్యారు. ఈ మేరకు డీఈఓ కిష్టప్ప వెల్లడించారు. 107 పరీక్షా కేంద్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 21,441 మంది విద్యార్థులకు గాను 21,228 హాజరయ్యారు.


