హిందూపురం: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో క్వింటా చింతపండు గరిష్టంగా రూ.25 వేలు పలికింది. సోమవారం మార్కెట్‌కు 3,600 క్వింటాళ్ల చింతపండు వచ్చింది. అందులో కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ.25 వేలు, కనిష్టంగా రూ.10 వేల చొప్పున క్రయ విక్రయాలు జరిగాయి. అలాగే ఫ్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.13 వేలు, కనిష్టంగా రూ.6,100 ప్రకారం పలికినట్లు మార్కెట్ కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు. మార్కెట్‌లో ప్రతి సోమ, గురువారాల్లో చింతపండు, మంగళ, శుక్రవారాల్లో ఎండుమిర్చి క్రయ విక్రయాలు జరుగుతున్నాయని, రైతులు నాణ్యమైన సరుకు తీసుకొచ్చి అధిక ధరలు పొందాలని ఆయన సూచించారు.


