● మంత్రి లోకేష్ మాటలకు అర్థాలే వేరు
స్కూల్ పిల్లలు అధిక బరువు కలిగిన పాఠ్యపుస్తకాలతో తీవ్ర అవస్థలు పడుతున్నారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల బ్యాగ్ బరువు తగ్గిస్తామని ఎన్నికల సమయంలో నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా బ్యాగ్ బరువును తగ్గించేశారు. నాసిరకం బ్యాగులను అందజేయడంతో నాలుగు నెలలకే అవి చిరిగి పోయాయి. చిరిగిన బ్యాగ్‌లతో ఇబ్బందులు పడలేక చాలా మంది విద్యార్థులు కొత్తవి కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇది చూసిన పలువురు ‘నారా లోకేష్ మాటలకు అర్థాలే వేరు’ అని ఎద్దేవా చేస్తున్నారు. – పుట్టపర్తి:


