ఎమ్మెల్యేను మార్చండి.. బైకర్లపై దృష్టి పెట్టండి
చిలమత్తూరు: హిందూపురంలో సమస్యలు తిష్టవేశాయని, పట్టించుకునే వారే కరువయ్యారంటూ సోషియల్ మీడియా వేదికగా పట్టణ ప్రజలు గగ్గోలు పెట్టారు. హిందూపురానికి చెందిన ఓ ఫేస్‌బుక్ పేజీలో సమస్యలపై స్పందించండంటూ పెట్టిన పోస్టింగ్‌కు పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రోడ్డు సమస్యలు, డ్రైనేజీ సమస్యలపై కామెంట్ చేసిన ప్రజలు... ట్రాఫిక్ సమస్యపై, ఇష్టారాజ్యంగా దూసుకెళుతున్న బైకర్లపై విరుచుకుపడ్డారు. ఏకంగా ఎమ్మెల్యేను మార్చండి అంటూ ఒకరు, ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ మరొకరు సూటిగా పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలైనా అభివృద్ధి పనులు చేపట్టలేదని, కనీసం ఇప్పటికై నా అభివృద్ధి పనులు చేపట్టాలని మరొకరు వ్యాఖ్యానించారు.
ఫేస్‌బుక్ పేజీలో హిందూపురం ప్రజల స్పందన


