వైఎస్సార్ సీపీ పీఏసీ మెంబర్‌గా ఇస్మాయిల్
కదిరి అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ (పీఏసీ) మెంబర్‌గా కదిరి నియోజకవర్గ నేత ఎస్‌ఎండీ ఇస్మాయిల్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తనపై నమ్మకం ఉంచి పార్టీలో అత్యున్నతమైన పదవిని కట్టబెట్టిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.
అసాంఘిక శక్తులను అణచివేయండి
● పోలీసులకు ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశం
ముదిగుబ్బ: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులను అణచివేయాలని ఎస్పీ సతీష్‌కుమార్ పోలీసులను ఆదేశించారు. బుధవారం ఆయన ముదిగుబ్బ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అదే విధంగా సిబ్బంది పనితీరు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, పెండింగ్ కేసులు తదితర వాటి గురించి సీఐ శివరాముడును ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ... గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. విజుబుల్ పోలీసింగ్ పెంచాలని, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.
నేడు ముదిగుబ్బ
రైల్వే గేట్ బంద్
ముదిగుబ్బ: మరమ్మతుల కారణంగా ముదిగుబ్బ – కదిరి మధ్య ఉన్న రైల్వే గేట్‌ను గురువారం మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారి శివం మోతూర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కదిరి– అనంతపురం మధ్య తిరిగే వాహనాలు బైపాస్ మీదుగా, అలాగే పుట్టపర్తికి వెళ్లే వాహనదారులు పాతూరు గేటు మీదుగా వెళ్లాలని సూచించారు.
వైఎస్సార్ సీపీ పీఏసీ మెంబర్‌గా ఇస్మాయిల్


