రమణీయం.. రథోత్సవం
మడకశిర రూరల్: ‘జై హనుమాన్...పవన పుత్రా పాహిమాం’ అంటూ వేలాది మంది భక్తులు కీర్తించగా జిల్లేడుగుంట గ్రామం ఆంజనేయస్వామి నామస్మరణతో మార్మోగింది. భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లెడుగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లెడుగుంటలో ఆంజనేయస్వామి బ్రహ్మరథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆంజనేయస్వామి, లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి రథంలో కొలువుదీర్చారు. అనంతరం పురోహితులు హోమం, విశేష పూజలు నిర్వహించి రథోత్సవం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు బొరుగులు, అరటిపండ్లు రథంపై విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవం సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం జ్యోతులు, భూతప్ప ఉత్సవాలను నిర్వహించనున్నారు.
కనుల పండువగా జిల్లేడుగుంట
ఆంజనేయస్వామి బ్రహ్మరథోత్సవం
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
రమణీయం.. రథోత్సవం
రమణీయం.. రథోత్సవం


